అవినీతి శాఖకు అడ్డంగా దొరికిన, మహిళా పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐ,

యూనిఫామ్ అవినీతి రెండు కలిసి ఉండలేవు శాంతి భద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవంటూ తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి తెలంగాణ పోలీస్ శాఖకు ఒక లేఖ రాసి స్పష్టంగా చెప్పారు.

అయితే ఇదంతా ఏమి పట్టనట్లు వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డ ఏకైక జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఓ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది.

పరిగి కొడంగల్ తాండూర్ వికారాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాలకు మహిళ సమస్యలు భార్యాభర్తల కొట్లాటలు కుటుంబ వ్యవహారాలు తగాదాలపై పట్ల ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేయబడ్డది ఈ మహిళా పోలీస్ స్టేషన్. అసలే కుటుంబ తగాదాలతో అలసిపోయి తమకు న్యాయం చేయాలని వచ్చే జంటలకు ఆసరానివ్వకుండా అండగా నిలబడకుండా మరీ ముఖ్యంగా మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అవినీతి అనే మాట అసహనాన్ని కలిగించడం ఆశ్చర్యం కలిగించింది.

అయితే తాండూర్ పట్టణ ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్ వారి భార్యాభర్తల తగాదాల నేపథ్యంలో కౌన్సిలర్ ఈర్షద్ తమ భార్య కుటుంబ సభ్యులను ప్రోత్సహించి తమపై కొంతమంది కేసు పెట్టించారని ఆరోపిస్తూనే దీని విషయమై మహిళా పోలీస్ స్టేషన్కు బెయిల్ పొందడానికి  వెళితే స్థానిక మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐ తమను లంచం ఇవ్వమని డిమాండ్ చేశారని ఈర్షద్ ఆరోపించారు. దాంతో నేను ఏసీబీ ని సంప్రదించాాలని ఏసీబీకి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులపై ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు మంగళవారం రోజు వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ పై రైడ్ నిర్వహించారు. ఈ రైడ్లో సీఐఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుబడడం జిల్లాలోని సంచలనం కలిగించింది.

ఎంతోమంది పేద మహిళలు కుటుంబ కలహాలతో తమ సమస్యలను తమ బాధలను పట్టించుకుని మా కుటుంబాలను ఒకటి చేయడని అయ జంటలు ఆశ్రయిస్తాయి.

భార్యాభర్తల బంధం చాలా విలువైందని వ్యవస్థలో అతి ముఖ్యమైందని అనేక పురాణాలు సాంప్రదాయాలు చెప్పకనే చెబుతున్నాయి.

అలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం కాకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ భార్యాభర్తలను కలపాల్సిన అవకాశాలు ఉంటే కలపాలి, లేదంటే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు పూనుకోవాలి. కుటుంబ కలహాలు భార్య భర్తల కొట్లాటల్లో సతమవుతున్న కుటుంబాలను అర్థంపర్థ లేకుండా  లంచం ఇవ్వమని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజం.

గతం నుండే ఈ పోలీస్ స్టేషన్ పై అవినీతి ఆరోపణలు ఉండేవని ఒక్కసారిగా జిల్లాలో ఇప్పుడు చర్చలు జోరు అందుకున్నాయి.

ఇప్పటికైనా జిల్లా పోలీసు అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి భార్యాభర్తలు కొట్లాడి తమ పోలీస్ స్టేషన్లకు వచ్చే కుటుంబాలకు అండగా నిలబడి చట్టపరమైన కౌన్సిలింగులు ఇచ్చి వారిని ఒకటి చేయడానికి వీలైతే ఒకటి చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం మంచిదని ప్రజల్లో ఇప్పుడు ఒక మాటగా చలామణి అవుతున్నది.

Exit mobile version