వీగిపోయిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు,

ముఖ్యాంశాలు,

హిందు 9 న్యూస్ బ్యూరో 17/4/2026,

 

 

____ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు, బిల్లుకు అనుకూలంగా298, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.

దిల్లీ: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్‌ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. దీనిపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. దీంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమైన 326 ఓట్లను ఎన్డీఏ సాధించలేకపోయింది. దీంతో మిగతా రెండు బిల్లులు..డీలిమిటేషన్‌ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026లను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు.

Exit mobile version