ఎన్నికలు,
హిందు 9 న్యూస్ బ్యూరో 17/4/2026,
______ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారు చేయండి, అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.!
గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు ఓటర్ల జాబితాను తయారుచేసి అధికారులు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది….
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం నుండి 2025 అక్టోబర్ 10 నుండి 2026 ఫిబ్రవరి 5 వరకు మండలాల వారీగా రూపొందించిన డేటాను స్వీకరించి, ధృవీకర ణ, సంబంధిత గ్రామ పంచాయతీ వార్డు రోల్స్కు మ్యాపింగ్ చేయడం కో సం ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాడ్యూల్లో హోస్ట్ చేసిందని తెలి పింది. ఈ నేపధ్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పం చాయతీ అధికారులు, జెడ్సీపీల ముఖ్య కార్యనిర్వహణాధికారులందరికీ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.
టెపోల్ ఇన్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెం ట్ సిస్టమ్ మాడ్యూల్లో హోస్ట్ చేసి మండలాల వారీగా విభజించబడిన అ సెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల అదనపు డేటాను ధృవీకరించి, సంబంధిత గ్రామ పంచాయతీలకు, పోలింగ్ స్టేషన్లకు కేటాయించి మ్యా ప్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.
జిల్లా పంచాయతీ అ ధికారి ధృవీకరణ తర్వాత, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జారీ చేసిన యూ జర్ మాన్యువల్ సూచనల ప్రకారం ఎంపిటిసి పోలింగ్ స్టేషన్లకు అనుసం ధానించాలని సూచించింది. సదరు డేటాలో గుర్తించిన ఏవైనా వ్యత్యాసా లు ఉంటే ఈ నెల 23 లోపు కమిషన్ కు నివేదించాలని సూచించింది.*