సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 14/4/2026,
____దేశంలో సభండ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు అసమానతలు పోతాయి, బిజెపి రాష్ట్ర నేత యు రమేష్ కుమార్,
అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తాండూర్ బిజెపి శాఖ, సబ్బండ వర్గాలు సామాజిక ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు అసమానతలు పోతాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తెలిపారు…..
తాండూర్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా తాండూర్ అంబేద్కర్ చౌక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాండూర్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ మాట్లాడుతూ బిజెపి పార్టీ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా సబండవర్గాలు సామాజిక ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరుకున్న ఏకైక పార్టీ బిజెపిని ఆయన అన్నారు.
దేశంలో సబ్బండవర్గాలు సామాజిక ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు అసమానతలు పోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దళిత బడుగు బలహీన వర్గాల కోసం బిజెపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అంబేద్కర్ ఆలోచన ఆశయాలకనుగుణంగా ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి తాండూర్ మున్సిపల్లో ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, బిజెపి కౌన్సిలర్లు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు యువ మోర్చా నేతలు తదితరులు పాల్గొన్నారు.