బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కై, ఆగస్టు 25న హైదరాబాదులో ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష, వికారాబాద్ జిల్లా బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలన్న జాతీయ నేత, కందుకూరి రాజ్ కుమార్

రాజకీయం

K, Yadaiah|August 22,2025

ఆగస్టు 25న బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచాలని కోరుతూ హైదరాబాదులో ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నట్లు అలాగే ఈ బీసీ సత్యాగ్రహ దీక్షకు వికారాబాద్ జిల్లా బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని జాతీయ నేత కందకూరి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు

తాండూర్:  బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 25 తారీఖున హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద సత్యాగ్రహ అధ్యక్ష చేయబోతున్నట్లు తాండూర్ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరు రాజకుమార్ తెలిపారు. ఈ సభకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాజకుమార్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఘర్షణ పూరిత వైఖరితో కాకుండా పూర్వకంగా బీసీల పట్ల ఆలోచించాలని అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్ల పట్ల కేంద్ర ప్రభుత్వంపై పూర్తి బాధ్యత నెటి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందని రాజకుమార్ విమర్శించారు. 50 ఏళ్లుగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజీలేని పోరాటం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య ఉద్యమాల ద్వారానే నేడు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలను విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పె ంపు విద్యార్థులకు సన్న బియ్యం ఇలా అనేక పథకాలను సాధించి పెట్టారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కొరకు ఆర్ కృష్ణ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు అన్ని కుల సంఘాల నాయకులు బీసీ యువకులు మహిళలు వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని 25 సభను జయప్రదం చేయాలని కోరారు.

Exit mobile version