మే 6న, ఎర్రన్ పల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రొఫెసర్ డాక్టర్ ఖాసిం,

ప్రెస్ నోట్ ఆధారిత వార్తలు,

హిందు 9 న్యూస్ వికారాబాద్ బ్యూరో 9/4/2026,

______ఎర్రన్ పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, ముఖ్యఅతిథిగా డాక్టర్ ఖాసిం,

మే 6న  కొడంగల్ మండలం ఎర్రన్ పల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ఖాసిం ఆవిష్కరించనున్నట్లు ఎర్న్ పల్లి శ్రీనివాస్ తెలిపారు….

కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఎర్రన్ పల్లి గ్రామంలో మే 6న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.

ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాసిం విచ్చేస్తున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా నలుమూలల నుండి ప్రజలు అంబేద్కర్ అభిమానులు ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు హాజరుకావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Exit mobile version