మావోయిస్టు అగ్రనేత సుమిత్ దా 17, ఏళ్ల తర్వాత బెయిల్ పై విడుదల,

ముఖ్యాంశాలు,

Kura Yadaiah/ March 1/2026,

హిందు 9 న్యూస్ :

-మావోయిస్టు అగ్రనేత విడుదల,

హిందు 9 న్యూస్, హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు సుమిత్ దా అలియాస్ అమిత్ బాక్సీ సుదీర్ఘకాలం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో దాదాపు 17 ఏళ్ల పాటు ఖైదీగా ఉన్న ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చారు.

మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుమిత్ దా.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా విప్లవ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. గతంలో వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన ఆయన జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు బెయిల్‌పై విడుదల కావడం మావోయిస్టు అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version