గణేష్ ఉత్సవాల కోసం పోలీస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి,, వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి,

భద్రత

K, Yadaiah|August 18,2025,

వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి

 Sp|త్వరలో వినాయక చవితి ఉత్సవాలు రాబోతున్న కారణంగా జిల్లాలో వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి నిర్వాహకులకు సూచించారు….

వికారాబాద్ జిల్లా /హిందు 9 న్యూస్ స్టాప్ :గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల కోసం గణేష్ మంటపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి తెలిపారు. ఈ ఆన్లైన్ నమోదు కేవలం భద్రతా బందోబస్తు ఏర్పాట్ల కోసం మాత్రమేనని దీనికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి మంటపం యొక్క సమాచారం అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితులలో లేదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రత చర్యలు తీసుకోవడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు తమ కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్ల ద్వారా

https://policeportal.tspolice.gov.in/index.htm అనే లింకును ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇది గణేష్ విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి కోసం ఒక సరళమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అయితే పోలీస్ శాఖ గణేష్ మంటప నిర్వాకులకు కొన్ని సూచనలు నిబంధనలు తెలియజేస్తూ ఈ విధంగా ఉండాలని తెలిపింది.

-విద్యుత్ భద్రత: షార్ట్ సర్క్యూట్లు జరగకుండా నివారించడానికి మండపంలో మంచి నాణ్యత గల వైర్లు మరియు విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి, విద్యుత్ సరఫరా జాగ్రత్తగా ఉండేలా చూడాలి,
-మండపం వివరాలు: మండపం కమిటీ వివరాలు బాధ్యత వహించే వారి పేర్లు ఫోన్ నెంబర్లను మండపం వద్ద సులభంగా కనిపించేలా ప్రదర్శించాలి, స్థానిక పోలీస్ స్టేషన్ మరియు పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లను కూడా అందుబాటు,
-డీజే లు నిషేధం: మండపాలలో డీజేలను అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టంలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు,
-షెడ్డు నిర్మాణం: విగ్రహం ప్రతిష్టించే ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన పటిష్టమైన షెడ్డు ఏర్పాటు చేయాలి,
-నిఘా: మండపంలో 24 గంటలు ఒక వాలంటరీ ఉండేలా చూసుకోవాలి. ఇది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి తోడ్పడుతుంది,
-క్యూలైన్లు: భక్తుల సందర్శనము దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి,
-అగ్నిమాపక జాగ్రత్తలు:
అగ్ని ప్రమాదాలను నివారించడానికి మండపం వద్ద ఇసుక బకెట్లు నీరు లేదా చిన్న అగ్నిమాపక యంత్రాన్ని అందుబాటులో ఉంచుకోవాలి,
-పాయింట్ పుస్తకం: నిర్వాకులు తప్పనిసరిగా ఒక బుక్ పాయింట్ పుస్తకాన్ని నిర్వహించాలి, పోలీసులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వివరాలు నమోదు చేసి సంతకం చేస్తారు,
-అనుమానస్పద వస్తువులు/ వ్యక్తులు: మండపాల వద్ద ఏదైనా అనుమానస్పద బ్యాగులు వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100,కు, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు.
-వదంతులును నమ్మొద్దు: సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని సమాచారాన్ని వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ సూచించారు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత పోలీసు అధికారులను లేదా డయల్ 100, కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్, 87 126 70056 కు కాల్ చేసి సమాచారం పొందాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వినాయక చవితి సందర్భంగా నిర్వాహకులకు సూచించారు.

Exit mobile version