ప్రజా పాలనలో పసికందుల హత్యలా ! ఇలాంటి దౌర్జన్యాలు ఆగేది ఎట్లా?? జాతీయ బీసీ అగ్రనేత కందుకూరి రాజ్ కుమార్,

ముఖ్యాంశాలు,

Kura Yadaiah/ February 24,2026,

హిందు 9 న్యూస్ :

కందుకూరి రాజ్ కుమార్ బీసీ అగ్రనేత

ప్రజా పాలనలో పసికందుల హత్యలా ! ఇలాంటి దౌర్జన్యాలు ఆగేది ఎట్లా యెట్లనో?? ప్రభుత్వం తెలంగాణ బీసీ సమాజానికి జవాబు చెప్పాలని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు….

హిందు 9 న్యూస్ (తాండూర్ 24):స్వరాష్ట్రం ప్రజాపాలనలో ప్రజాస్వామ్య హక్కులకు పెద్దపీట వేస్తామన్న ఇందిరమ్మ రాజ్యములో కుమ్మెర లాంటి ఘటనలు ఏ రూపాన్ని తెలుపుతున్నాయో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీసీ సమాజంతో పాటు దళిత సమాజానికి జవాబు చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఇటీవల నాగర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన పసికందు హత్య దళిత బిసి కుటుంబాలపై జరిగిన దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నదని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఇంకా పల్లెల్లో బీసీ ఎస్సీ ఎస్టీ కులాలను ఎన్ని దినాలు భయభ్రాంతులకు గురి చేస్తారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నట్లు ఇప్పటికే  పత్రిక టివి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మనకు ప్రతిరోజు ఎక్కడో ఒక కాడ కనిపిస్తున్నదని బీసీ ఓట్లతో గద్దెనికి కూర్చున్న ప్రభుత్వ పెద్దలకు ఇలాంటివి కనిపిస్తలేదా? అని ఘాటుగా మండిపడ్డారు.

బీసీ ఎస్సీ ఎస్టీలపై ఇప్పటికి సొంత రాష్ట్రంలో కూడా కుట్రలు చేయడం ఏందని కుట్రలు చేసి భౌతిక దాడులు చేయడం సామాజిక మార్పు కోరే ప్రభుత్వానికి ఇది తగునా అని రాజ్ కుమార్ అన్నారు.

తరాలు మారినై రోజులు మారుతున్నాయి కాలం డిజిటల్ వైపు పరిగెడుతున్న మనుషులను మనుషులుగా చూసే సమాజం రాకపోవడమే బాధ కలిగిస్తున్నదని ఆవేదనపడ్డారు.

గణేష్ చంద్రకళ  బీసీ కుటుంబంపై ఆ కుటుంబంలో ఓ పసికందు మృతి చెందడం మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలిస్తుందని ప్రభుత్వం ఇప్పటికీ దీనిపై ఎలాంటి నోరు మెదపకపోవడం దేనికి సంకేతమే ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి వారిపై హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇలాంటి కుల దురహంకార దాడులు పునరావృతమైతే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అలాగే బాధ్యత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి కేసుకు సంబంధమున్న వారందరిపై రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాత విచారణ జరిపి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మెప్పించాలని చెప్పుకొచ్చారు.

Exit mobile version