ముఖ్యాంశాలు
Kura Yadaiah February 10,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో !
పోక్సో కేసులో వికారాబాద్ జిల్లా న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కరాగర శిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు…..
హిందు 9 న్యూస్ (వికారాబాద్ ) మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్లు కట్టిన కారగారా శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళితే 2023లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీ వికారాబాద్ మండలం అత్వెల్లి నరేందర్ అలియాస్ నరేష్ అనే వ్యక్తి ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు ఫోక్స్ ఇతర ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ కేసు విచారణ వికారాబాద్ జిల్లా మొదటి అదనపు జిల్లా సెషన్ కోర్టు విచారణ చేపట్టి సాక్షళ సాక్షాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ చంద్ర కిషోర్ సాక్ష్యాలు రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠినగార శిక్ష పాటుగా 20,000 రూపాయల జరిమానా విధిస్తూ 9/2/2026, తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా తెలిపారు.
అయితే బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వపరంగా ఐదు లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పకడ్బందీగా వ్యవహరించి దర్యాప్తును వేగవంతము చేసి నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు. అప్పట్లో ఈ కేసు విషయంలో చాకచక్కంగా వ్యవహరించిన అధికారులు టి శ్రీను సిఐ బివి సత్యనారాయణ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి మేరాజ్ ఫిర్డోస్ ప్రస్తుత సిఐ కె రఘుకుమార్ నిరంజన్ గౌడ్ భరోసా సెంటర్ ప్రతినిధులతో శ్వేత ఎస్సై కీర్తి ఆకుల లీగల్ అడ్వైజర్ కోర్టు డిప్యూటీ ఆఫీసర్ ఎల్ నరేందర్ మాణిక్ ప్రభు లను జిల్లా ఎస్పీ ప్రశంసించి అభినందించారు. మహిళల పట్ల చిన్నారుల పట్ల ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.