ముఖ్యాంశాలు
Kura Yadaiah /February 8,2026
హిందు 9 న్యూస్ బ్యూరో ;
-100 కోట్లతో తాండూర్ ను అభివృద్ధి చేశా,
-మున్సిపల్ ఎన్నికల అనంతరం డబల్ బెడ్ రూమ్ పంపిణి,
-అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా?
-రోహిత్ రెడ్డి ఎన్నికల కోసం దుష్ప్రచారాలు చేస్తున్నాడు! ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
MLA Manohar Reddy |టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రజా సమస్యలపై ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని 100 కోట్లతో తాండూరును అభివృద్ధి చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అంటూ తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు…….
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గుర్తుకు రాలేవా ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఇంద్రానగర్ కార్నర్ మీటింగ్లో ప్రభుత్వ చీఫ్ వి పట్నం మహేందర్ రెడ్డి తో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తాండూర్ యువతను తప్పుదోవ పట్టించి డ్రగ్స్ గంజాయి కి బానిస చేసిండ్రని ప్రతిపక్ష పార్టీపై ఘాటుగా మండిపడ్డారు. గతంలో మహిళా చైర్మన్ ను అవమానించింది వీళ్ళు కాదా అని ప్రశ్నించారు.
అధికారం కోసం రోహిత్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నాడు !
ఇప్పుడు అధికారం కోసం మళ్లీ రోహిత్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నాడని దుష్ప్రచారాలను ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదని హితవు పలికారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మోసపూరిత హామీలు నమ్మాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముఖ్యంగా తాండూర్ హైదరాబాదు రోడ్డు పనులను పూర్తి చేసినమని తాండూర్ పట్టణానికి దాదాపుగా 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని లబ్ధిదారులు నిర్మాణ పనులు కూడా ప్రారంభించారని ఎమ్మెల్యే అన్నారు. తాండూర్ లో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా కొనసాగుతున్నదని చెప్పుకొచ్చారు. గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై ప్రేమను వలుకబోతున్నదని ఎద్దేవ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత తాండూర్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు కాగ్న నది నుండి నీరు అందించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం పట్టణంలో మహిళలకు దాదాపుగా 15 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం తమకు సాధ్యమైందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందిరమ్మ ఇండ్లు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ తో పాటు రైతులకు రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం గొప్పగా ప్రారంభించుకున్నదని ప్రకటించారు.
-గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం,
గత సాధారణ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని దాంట్లో భాగంగానే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తాండూర్ మున్సిపల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు మంజూరు చేసినట్లుగా కూడా ప్రకటించారని ఇది ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అంటూ మాట్లాడారు. రెండేళ్ల పాలనలో దాదాపుగా 100 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం కే సాధ్యమైందని అన్నారు. శివాజీ చౌక్ నుండి మల్రెడ్డిపల్లి వరకు రెండు కోట్లతో నూతన రోడ్డు నిర్మాణం జరిగింది. పాత తాండూర్ బ్రిడ్జి గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టపోయారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ మొత్తంలో నష్టము జరిగినట్టు డిజైన్ చేసి పనులను కూడా ప్రారంభించిన ఘనత మాదేనని అది కాంగ్రెస్ ప్రభుత్వం దేనని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇవన్నీ అభివృద్ధి పనులు కావా ఇవన్నీ పనులు ప్రతిపక్ష పార్టీ నాయకులకు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.
ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు తప్పకుండా గెలిపిస్తారు,
ప్రజలు తమను విశ్వసిస్తున్నారని తప్పకుండా ప్రజల మీద నమ్మకం ఉందని ఈ నెల 11 తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని ఆ నమ్మకు తమకుందని అధిక మెజార్టీతో తాండూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నామని చెప్పుకొచ్చారు. తాండూర్ పట్టణ ఓటర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడి చేతు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు దారాసింగ్ మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ సీనియర్ నాయకులు అభ్యర్థులు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.