ముఖ్యాంశాలు
Kura Yadaiah |February 8,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :
-ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక తీర్పే నన్ను గెలిపిస్తుంది,
-వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం,
-రోహిత్ రెడ్డి సహకారంతో ప్రజా సంక్షేమానికి అండగా నిలబడతా,
Bhaskar BRS party |ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు తనను గెలిపిస్తుందని గెలిచిన తర్వాత వార్డు అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి రోహిత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తానని బిఆర్ ఎస్ 22వ కౌన్సిల్ అభ్యర్థి భాస్కర అన్నారు…
హిందు 9 న్యూస్ (తాండూర్); తాండూరు పట్టణ కేంద్రంలోని 22వ వార్డు గొల్ల చెరువు నుండి టిఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికల బరిలో భాస్కర్ ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు తనను గెలిపిస్తుందని 22వ వార్డు టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత వార్డు అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి తన శాయశక్తుల కృషి చేస్తానని ఇక్కడి వార్డు ప్రజలకు మాటిస్తున్నానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆదివారం రోజు విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కౌన్సిల్ ఎన్నికలలో తనను కౌన్సిలర్ గా గెలిపించిన అనంతరం గొల్ల చెరువులో నెలకొన్న సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రైమరీ స్కూల్ లేదని, స్కూల్ నిర్మాణానికి అలాగే డ్వాక్రా భవనం అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గట్టిగా ప్రయత్నిస్తానని వాటిని పూర్తిిిిిిి చేసే విధంగా చూస్తానని చెప్పుకొచ్చారు.
–తాగునీటి సమస్య మురగు కాలువల నిర్మాణం కోసం మొదటి ప్రాధాన్యతనిస్తా
ప్రజలను అనేక సందర్భాల్లో ఇక్కడ మంచినీటి సమస్య వేధిస్తున్నదని వాటిని మొదటగా ప్రధానంగా పరిష్కరించే విధంగా చూస్తానని వార్డు ప్రజలతో ప్రచారంలో భాగంగా అన్నట్లు చెప్పారు. త్రాగునీటి సమస్య, సి.సి రోడ్డు సమస్య, మురుగు కాలువల సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతోపాటు నిరుపేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక్కడ ధోోబి ఘాట్ సమస్య కూడా చాలా తీవ్రమైన సమస్యగా ఉందని ఇక్కడి రజక సోదరులకు దోబీ ఘాటును అభివృద్ధి చేసి వారి వృత్తికి సహకరించి అండగా నిలబడతానని రజక సోదరులకు నేను ధైర్యం ఇస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయించి ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
రోహిత్ రెడ్డి సహకారంతో ముందుకెళ్తా, వార్డును అభివృద్ధి చేస్తా
వీటన్నిటిని విడతలవారీగా పరిష్కరించేందుకు తప్పకుండా మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి సహకారంతో కాబోయే మున్సిపల్ చైర్మన్ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి దిశలో నడిపించడానికి కృషి చేస్తా ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా సమసమాజ నిర్మాణం కోసం నేనెప్పుడూ ముందుండేవాాాణ్ణి ప్రజలంతా సమానమే ప్రజా సంక్షేమం అభివృద్ధి నా ప్రధానమైన లక్ష్యాలు నేను ఇక్కడి ప్రజలకు చివరిి వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని భాస్కర్ వెల్లడించారు. ఇప్పటికే వార్డులో ప్రజలు నాయకులు తమ పనితనాన్ని మంచితనాన్ని చూసి అండగా నిలబడుతున్నారని తప్పకుండా ఇక్కడి ప్రజలు నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమకు ఒకసారి అవకాశం ఇచ్చి అండగా నిలబడి మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా ఆశీర్వదించి 11 తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నట్లు భాస్కర్ తెలిపారు.
-ప్రజలను మరోసారి వేడుకుంటున్న , కృష్ణ,
ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలతో కోరారు. వార్డు ఇన్చార్జ్ కృష్ణ మాట్లాడుతూ విద్యావంతుడైన భాస్కర్ ను గెలిపించడంతో వార్డు అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. భాస్కర్ మంచితనం మానవత్వం కలగలి ఉన్న వ్యక్తి నిరంతరం ఆ రోజు నుండి ఈరోజు వరకు ప్రజల్లోనే ఉంటూ తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేస్తున్న వ్యక్తి భాస్కర్, ఎప్పుడు అందరితో కలిసిమెలిసి సహనంతో ఓపికతో ఉండే నాయకుడు భాస్కర్ అంటూ ఇంచార్జి కృష్ణ కొనియాడారు. భాస్కర్ అంటే ఇక్కడి ప్రజలకు అమితమైన ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఉన్నాయని తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి భాస్కర్ ను గెలిపించుకోవాలని ఇక్కడి ప్రజల్ని మరోసారి వేడుకుంటున్నానని కృష్ణ అన్నారు. గొల్ల చెరువు అభివృద్ధి జరగాలంటే తప్పకుండా భాస్కర్ లాంటి చురుకైన వ్యక్తి ఉండాలని అలాంటి వ్యక్తికి మనందరం ఓటేసి గెలిపించకుంందామని వార్డు ఓటర్లకు కృష్ణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి కృష్ణ, మాజీ ఎంపిటిసిల సంఘం మండల అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వడ్డే ఉలగప్ప, బిఆర్ఎస్ నాయకులు పెద్ద వెంకటయ్య, రాములు, శివ ఎం రాములు హుస్సేన్ శ్రీను బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.