BRS కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన, భాను కుమార్ ,నాగరాజు

ముఖ్యాంశాలు 

Kura Yadaiah|  February 8,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన భాను కుమార్, కొట్రిక నాగరాజు లు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేస్తామని వారు ప్రకటించారు…..

హిందు 9 న్యూస్( తాండూర్) మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పార్టీ నుండి ఆ పార్టీకి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి పార్టీలు మారడం సర్వసాధారణమైనది. ఈ సందర్భంగానే తాండూర్ మున్సిపల్ కు చెందిన సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తర్లపల్లి భాను కుమార్, కొట్రిక నాగరాజులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సాయి శక్తుల కృషి చేస్తామని పార్టీ బలోపేతానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును అండగ నిలబడి గెలిపిస్తామని భాను కుమార్ నాగరాజును ప్రకటించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతుందని పేర్కొన్నారు.

Exit mobile version