ముఖ్యాంశాలు,
Kura Yadaiah| February 3,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :
-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి,
-తాండూర్ అభివృద్ధికి అండగా ఉంటా, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ,
MLA Manohar Reddy |తాండూరు అభివృద్ధికి అండగా ఉంటానని తాండూర్ ప్రజల సంక్షేమమే తన ప్రధాన కర్తవ్యం అని ఆ దిశగా ఆలోచించు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు….
హిందు 9 న్యూస్ (తాండూర్ ) : తాండూరు అభివృద్ధికి అండగా ఉంటానని తాండూర్ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన కర్తవ్యమని ఆ దిశగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వ్యక్తులకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని తాండూర్ మున్సిపల్ ప్రజలను తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా 10, 21,వ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ దాదాపుగా 30 మంది బిఆర్ఎస్ కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు వారికి కండువా కప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు . తాండూరులో అభివృద్ధికి సంక్షేమానికి అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వార్డులలో ప్రచారం జోరును పెంచారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
సోమవారం రోజు 10,21, వార్డులతో పాటుగా మిగిలిన వార్డుల్లో కూడా గడప్ప గడపకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడి ప్రజలకు సంక్షేమానికి అండగా నిలబడతానని సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. ఇప్పటికీ తాండూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఇక మీదట కూడా స్థానిక ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. నేను ఎప్పుడు స్థానికంగానే ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నానని ఇక మీదట కూడా ప్రజలు సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరించుతానని హామీ ఇచ్చారు. కాబట్టి తాండూర్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తో పాటు డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, పట్టణ అధ్యక్షులు అభిబ్ లాల పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ల చైర్మన్ తో మహిళలు తదితరులు ఉన్నారు.