తాండూరులో కల్తి కోవా స్థాపరాలపై టాస్క్ఫోర్స్ దాడి, ఇద్దరు వ్యక్తుల అరెస్ట్, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా

 ముఖ్యాంశాలు,

Kura Yadaiah| January 31,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

 

SP Vikarabad | తాండూర్ పట్టణంలో కల్తీ కోవా స్థావరాలపై శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు…

హిందు 9 న్యూస్( తాండూర్ ):ఇప్పటికీ నాణ్యతలేని కల్తీ ఆహార పదార్థాల వల్ల కల్తీ పానీయాల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాద బారిన పడుతున్న సంగతి విధితమే, అయితే ఇటివల వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కల్తీ కోవా స్థావరాలపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు. ముందస్తుగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారీ మరియు విక్రయం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్ పోలీస్ ఇస్పెక్టర్ ఎండి అన్వర్ పాషా,తో పాటుగా ఇతర పోలీస్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ మెరుపు దాడిలో 120 కిలోల కల్తీ కోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దొంగ వ్యాపారానికి పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ విష్ణు హైదరాబాద్ చాంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పి పేర్కొన్నారు. సీజ్ చేసిన కల్తీ కోవాతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన నిమిత్తం తాండూర్ పోలీసులకు అప్పగించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.

కల్తీ ఆహార పదార్థాలకు పాల్పడితే చర్యలు తప్పవు,

కల్తీ ఆహార పదార్థాలకు గాని కల్తీ పానీయాలకు గాని పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కల్తీ ఆహార పదార్థాలు అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించే పరిస్థితి ఉండదని ఘాటుగా హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

Exit mobile version