పెద్దేముల్ వికలాంగుల కమ్యూనిటీ హాల్ పై, రాష్ట్ర దివ్యాంగుల కమిషనర్ కు ఫిర్యాదు ,తగిన విచారణ జరిపి వికలాంగులకు భవనాన్ని అప్పజెప్పాలన్న, డిజేబులిటీ& రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah |January 20,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

పెద్దేముల్ మండలం కమ్యూనిటీ హాల్ యొక్క దృశ్యం

Disable|వికలాంగుల సంక్షేమార్గం పెద్దేముల్ మండలంలో నిర్మించిన వికలాంగుల కమ్యూనిటీ హాల్ పై తగిన విచారణ జరిపి స్థానిక వికలాంగుల సంస్థలకు గాని వికలాంగుల సంఘాలకు వికలాంగులకు గాని అప్ప చెప్పాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కమిషనర్ కు  ఫిర్యాదు చేసినట్లు డిజేబులిటీ & రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్  ప్రతినిధులు తెలిపారు….

 Disable| హైదరాబాద్ ప్రతినిధి :పెద్దేముల్ మండలంలోని దివ్యాంగులు సమావేశమై అభివృద్ధి సంక్షేమం వికలాంగుల సమస్యలు వారి హక్కులు చట్టాలు సాధక బాధలను చర్చించుకునేందుకై ఆనాటి ప్రభుత్వం 2016లో మండల కేంద్ర భవనాల సముదాయాల పక్కన వికలాంగుల కమ్యూనిటీ హాల్  ను నిర్మించింది.

2016, లోనే  కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన, నేటికీ వికలాంగులకు దక్కని స్థితి,

అదే సంవత్సరంలో ఆనాటి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఈ కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. ప్రారంభ సమావేశంలో మండల వికలాంగులకు వికలాంగుల సంస్థలకు సంఘాలకు కూడా సరియైన సమాచారం లేకుండానే వికలాంగుల భవనాన్ని ఆధార బాధగా  ప్రారంభించడం శోచనీయమే, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రారంభం నాడే మండల వికలాంగులను కానీ వికలాంగుల సంస్థలను సంఘాలను కానీ పిలిచి ఆ యొక్క భవనం వికలాంగులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులపై నిర్మించిన కాంట్రాక్టర్ పై బాధ్యతగా ఉండింది. కానీ అలా ఏమి లేకుండా  సాదాసీదాగా భవనాన్ని ప్రారంభించి గాలికి వదిలేశారు. భవనం నిర్మించి కూడా వికలాంగులకు ఎలాంటి ప్రయోజనం కానీ ఎలాంటి ఉపయోగం గానీ లేకుండా పోయింది.  చాలామంది మండల వికలాంగులు వారి వారి సమస్యలు పనులను చక్కబెట్టుకోవడానికి మండల కార్యాలయాలకు వచ్చిన ఆ భవనంలో కూర్చునే పరిస్థితి గానీ సేద తీరే పరిస్థితి కానీ లేదు వారి సమస్యలను వారి స్థితిగతులను సంక్షేమాన్ని అభివృద్ధిని హక్కులను చర్చించుకునేందుకు సమావేశం అవుదాం అనుకుంటే కూడా ప్రస్తుతం అక్కడ చోటు లేకుండా పోయిందని మండల వికలాంగులు వాపోయారు. వికలాంగులు ఎక్కడో ఒక కాడ సమావేశమై చర్చించుకుని వెళ్లిపోయే నీచమైన పరిస్థితి దాపురించిందని  డిజబులిటీ &రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ మండల అధ్యక్షులు మల్లప్ప పాండు చాంద్ పాషా రాములు ఇలా అనేకమంది వికలాంగులు తమ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ భవనాన్ని రెవెన్యూ శాఖ కిందిస్థాయి అధికారులు ఉపయోగించుకుంటున్నారని పలువురు వికలాంగులు ఆరోపించారు.!ఈ కమ్యూనిటీ హాల్ పై గతంలోనే అనేకమంది వికలాంగులు సామాజికవేత్తలు ప్రజలు  చాలాసార్లు చర్చించారని ఇటి సమస్య చర్చకు కూడా దారితీసిందని సదరు వికలాంగులు పేర్కొన్నారు.

తెలంగాణ దివ్యాంగుల రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేసిన, డి అండ్ ఆర్డిఏ,

పనుల కోసం వస్తున్న వికలాంగులు కూడా భవనం వద్దకు వెళ్లి చూడగా అక్కడ స్థానిక అధికారులు ఉండడం గమనించి  ఆవేదనకు గురై బాధపడ్డట్లు పలువురు వికలాంగులు తమ బాధలను  వెలిబుచ్చుతూ ఇదే విషయమై పెద్దేమల్ మండలం డిజేబులిటీ &రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంస్థ మండల అధ్యక్షులు మల్లప్ప దృష్టికి తీసుకురాగా మండల అధ్యక్షులు మల్లప్ప తోటి వికలాంగులు పాండు చాంద్ పాషా రాములు లక్ష్మప్ప లు కలిసి డిజేబులిటీ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంస్థ  వారి దృష్టికి తీసుకురావడంతో స్పందించిన  సంస్థ ప్రతినిధులు కూర యాదయ్య తోటి వికలాంగులతో కలిసి ఇట్టి సమస్యపై తగిన విచారణ జరిపి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వికలాంగులకు దక్కాల్సిన కమ్యూనిటీ హాల్ ను వికలాంగుల సంక్షేమం అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకొని అట్టి భవనాన్ని వికలాంగుల సంస్థలకు సంఘాలకు గాని సంస్థలకు గాని అప్పజెప్పాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర కమిషనర్ స్పందించి కూడా పిటీషన్ను స్వీకరించి నట్లు తెలిపారు.

దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దక్కాల్సింది అడ్డుకుంటే చట్టపరమైన చర్యలకు పూనుకుంటాం, కమిషనర్ పై , చట్టాలపై మాకు గౌరవం నమ్మకం ఉన్నాయి.

దివ్యాంగుల చట్టంలో కూడా వికలాంగులకు దక్కాల్సిన ప్రతి సంక్షేమ అర్థం కోసం నిర్మించిన భవనాలు కానీ లేదా పథకాలు కానీ వికలాంగులకు కేటాయించాలని అలా కాకుండా చట్టానికి విరుద్ధంగా వికలాంగుల హక్కులకు భంగం కలిగిస్తూ  నేటి వరకు కూడా వికలాంగుల భవనాన్ని వికలాంగులకు అప్పజెప్పకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని, గౌరవ కమిషనర్ పై  మా సంస్థకు గాని వికలాంగులకు గాని నమ్మకం గౌరవం ఉన్నాయని మండల వికలాంగులకు ఇట్టి విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, అధ్యక్షులు మల్లప్ప చాంద్ పాషా పాండు రాములు తెలిపారు.  ఇలాంటి సమస్యలు లేదా వికలాంగుల సంబంధించిన ఇతర అతను ఏ సమస్యలు ఉన్న ఇలాంటి సమస్యలైనా తమరు దృష్టికి తీసుకు రావాలని అందరం కలిసి సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్లే విధంగా చూద్దామని అలాగే చట్టాలను న్యాయస్థానాలను  గౌరవించుకోవడం మనందరి పైన ఉందని గుర్తు చేశారు.

 

Exit mobile version