ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah January 19,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రతి ఒక్కటి పరిష్కరించాలని అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టు తెప్పించుకొని పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అధికారులను ఆదేశించారు…

వికారాబాద్ జిల్లా : జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసిన వారి దరఖాస్తులను బరికతీసిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సందర్భంగా అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆన్లైన్లో ఇండాస్మెంట్ ఇవ్వాలని ఒకవేళ ఏదైనా పిర్యాదు పరిష్కారం కానట్లయితే పరిశీలించి క్షేత్రస్థాయి నుండి రిపోర్టు తెప్పించి వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులు ఆర్డీవోలు ప్రజావాణి పురాదులపై ప్రత్యేక దృష్టించాలని పేర్కొన్నారు.

పెన్షన్లు ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున ప్రజావాణిలో ప్రత్యేకించి ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు సమాచారం చెప్పేలా అధికారులు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అధికారులంతా క్రమం తప్పకుండా హాజరుకావాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి రెవెన్యూ వదనపు కలెక్టర్ రాజేశ్వరి స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ సుదీర్ డిఆర్ఓ మంగీలాల్ ఆర్డీవో వాసు చంద్ర డిఆర్డిఓ శ్రీనివాస్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version