తట్టెపల్లి పరిసర ప్రాంతంలో ఎర్ర మట్టి తవ్వకాలు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి!, దుమ్ము కాలుష్యం, గుంతల రోడ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం,

భద్రత 

Kura Yadaiah| January 14,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

 

ఎర్ర మట్టి రవాణా చేస్తున్న దృశ్యం

తట్టేపల్లి పరిసర ప్రాంతాల్లో ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ టిప్పర్రలో ఎర్ర మట్టి రవాణాను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు…..

పెద్దేముల్:  పెద్దేముల్ మండలం తట్టేపల్లి పరిసర ప్రాంతాలలో  ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడు  టిప్పర్రలో అక్రమ రవాణా చేస్తూ  దుమ్ము కాలుష్యం వల్ల రోడ్లన్నీ గుంతల మయంగా మారి రవాణా పాదాచారులకు  ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతినిత్యం వాహనాలలో ఇక్కడి నుండి కర్ణాటక ప్రాంతంలో ఉన్న సిమెంట్ కర్మాగారాలకు ఎర్రమట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి కొడుతున్నా  అధికారులు  రవాణా  శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం నిర్లక్ష్య ధోరణినిలా కనిపిస్తోంది.

దానికి తోడు  గ్రామాలలో నడి వీధులనుండి   ఓవర్ లోడ్ తో టిప్పర్రు వెళ్లడం వల్ల రోడ్లు గుంతలు దుమ్ము వెదజల్లడంతో పాదచారులు విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు వెళ్లాలంటేనే భయం భయంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

దుమ్ము కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు!

ఇదే తతంగం కొనసాగితే సమీప గ్రామాలు దుమ్ము కాలుష్యంతో ఉన్న రోడ్లు గుంతలు సంకర తేలి రోడ్డు ప్రమాదాల లాంటివి సంభవించే అవకాశం ఉన్నదని అలాగే స్థానిక ప్రజలు శ్వాసకోశ వ్యాధుల లాంటి వాటి భారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదని  ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రభుత్వాలు తగిన నిబంధనలను విధించాలని మరో అంశం ఏంటంటే  ఇంత జరుగుతున్న అధికారులు పోలీసులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశాలేనని పర్యావరణవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రవాణా అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి ఓవర్ లోడు లారీలను నియంత్రించి ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కల్పించి గ్రామీణ ప్రాంతా రోడ్లను పరిరక్షించాల్సిన అవసరం  ఉందని స్థానికులు కోరుతున్నారు.

Exit mobile version