భద్రత
Kura yadaiah December 29,2025,
హిందు 9న్యూస్ బ్యూరో :-
ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ప్రజల సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలని దారూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ జిల్లా పోలీసులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా సూచించారు…..
వికారాబాద్ జిల్లా :-పోలీస్ స్టేషనులకు ఫిర్యాదుదారులు వస్తే మర్యాదగా వ్యవహరించాలని ప్రజల సమస్యలను ఓపికగా వినితక్షణమే స్పందించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వికారాబాద్ జిల్లా పోలీసులకు సూచించారు. సోమవారం రోజు దారూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భంగా అన్నారు.
ధారూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్లను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ,
జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ధారూర్ సర్కిల్ పరిధిలోని ధారూర్ ,బంటారం, కోటపల్లి, పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను క్రైమ్ రిజిస్టర్లను పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. కేసుల విషయంలో ఎలాంటి పెండింగ్ పైళ్లను ఉండ కుండా చూసుకోవాలని కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఉంచాలని ప్రజల్లో అభద్రత భావాన్ని పోగొట్టడానికి పెండ్లి పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దారుల్ సర్కిల్ అనే స్పెక్టర్ సిహెచ్ రఘురాములు బంటారం ఎస్సై పి విమల కోటపల్లి ఎస్సై ఎం శైలజలు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.