ప్రకటన
Kura Yadaiah December 27,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-
రండి! కదలి రండి !
*ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ*
ఆవిర్భావ సభ,
తేదీ : 28 12 2025, ఆదివారం, సమయం : మ,, 12 గంటలకు, స్థలం: పండుగ సాయన్న జన్మస్థలం, మిరుగోన్ పల్లి, నవాబ్ పేట మండలం, మహబూబ్ నగర్ జిల్లా.
ముదిరాజ్ సోదరులారా …..!
చరిత్ర పుటల్లో ఒకనాడు రాజులం, ముత్తు రాజులం, ముదిరాజులం. వీర పాండ్య కట్ట బొమ్మన వారసులం. భారత ఉపఖండములోని దక్షిణా పథంలో చక్రవర్తులుగా, రాజులుగా, సామంత రాజులుగా, మండల అధ్యక్షులుగా, సేనాధిపతులుగా, పాలెగాళ్లుగా, సైనికులుగా, గ్రామ పాలకులుగా… అత్యంత వైభవోపేత చరిత్రను సొంతం చేసుకున్న ముదిరాజులం. ఆ తర్వాత కాలక్రమంలో రాజ్యాలు కూలిపోయినయ్. రాజరికాలు అంతరించిపోయి చెట్టుకు ఒకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై నేడు కడుపేదరికంలో జీవితం గడుపుతున్నాం. తెలంగాణ పల్లెల్లో ముదిరాజులేని పల్లె లేదు. బీసీ కులాలలో ఏ ఒక్క బీసీ కులం కంటే కూడా ఎక్కువ జనాభా శాతం ఏడు శాతం జనాభా కలిగిన కులం ముదిరాజు కులం.
కుల జనాభా దామాషా లెక్క ప్రకారం తెలంగాణలో 119 ఎమ్మెల్యేలకు 10 మంది ఎమ్మెల్యేలు ముదిరాజులే ఉండాలి. కాలం గడుస్తూ వస్తున్న కొద్ది ప్రాతినిధ్యం తగ్గిపోతూ వచ్చి నేడు ఒకే ఒక్క ఎమ్మెల్యేకు చేరుకుంది. విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో అట్టడుగు స్థాయికి నెట్టబడ్డం. అగ్రకుల పార్టీలు వారి ఆధిపత్యం కోసం బీసీ డీ నుండి ఏ లోకి మారుస్తామంటూ…ఆశ పెట్టడం ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అనడం షరా మామూలే అయింది. ఇక మన కుల సంఘాలు దశా దిశా లేని స్థితికి దిగజారిపోయినయి.
మన కుల పెద్దలు పెట్టిన కులాతీత, అప్రకటిత కుల రాజకీయ పార్టీలు ఇటుకుల ప్రజల హృదయాన్ని గెలుచుకోలేకపోయినయి. అటు కులేతర బహుజన సమాజాన్ని గెలుచుకోలేకపోవడంతో రాజకీయంగా చేదు అనుభవాలే మిగిలినయి. అయినా యుద్ధం తప్పదు. మన భవిష్యత్ తరాల కోసం, మన బిడ్డల కోసం మరో యుద్ధానికి సిద్ధం కాక తప్పదు. కులం కూడగట్టే ఆయుధం. మన కులం పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టుకుందాం. బహుజన కుల పార్టీలతో అలయన్స్ కడదాం. విద్యా, ఉద్యోగ, రాజకీయ ఆర్థిక రంగాలలో కుల జనాభా దామాషా వాటాను సాధించుకుందాం.
కాబట్టి ముదిరాజ్ సోదరులారా!
పై అవగాహనతో “ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ ” ఆవిర్బావ కార్యక్రమం 28.12. 2025, ఆదివారం, పండుగ సాయన్న నడయాడిన నేల మిరుగోన్ పల్లె, నవాబ్ పేట్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, జరుగ నుంది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.
సామాజిక ఉద్యమాభి వందనాలతో…
దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజ్.
“ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ”
ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ,
9963341736