ఎన్నికలు
Kura Yadaiah |November 28,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-
Sarpanch selection|పెద్దేముల్ మండలం సిద్ధన్న మదుగు తాండ సర్పంచ్ , వార్డు సభ్యుల ఏకగ్రీవానికి గ్రామ పెద్దలు యువకులు ఆమోదం తెలిపారు….
Sarpanch election|పెద్దేముల్:- పెద్దేముల్ సిద్ధన్న మదుగుతాండాలో సర్పంచ్ వార్డు సభ్యుల ఏకగ్రీవానికి గ్రామ పెద్దలు యువకులు అంగీకారం తెలిపారు.పెద్దేముల్ మండలంలో పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను వార్డు సభ్యులను ఏకగ్రీవం చేయడానికి చాలా గ్రామాలు ప్రజలు నాయకులు గ్రామ పెద్దలు యువకులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యుల ఏకగ్రీవం జరిగితే ప్రభుత్వం నుండి ప్రత్యేక ప్రోత్సహకాలతో పాటు సామరస్య వాతావరణం కూడా నెలకొంటుందని గ్రామాలలో ప్రజలంతా ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తుంది.స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి 1000 లోపు జనాభా కనుక ఉంటే వాటికి పదివేల నజరానా ఇస్తామని ప్రకటించిన విషయం ప్రజలందరికీ విధితమే. అయితే ఇట్టి పదివేల రూపాయలను తన అంటే ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు ఇస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం సిద్ధన్న మడుగుతాండ గ్రామ పెద్దలు యువకులు ఏకాభిప్రాయంతో ఏ పార్టీ ప్రమేయం లేకుండా సర్పంచును వార్డు సభ్యులను ఏకగ్రీవంగా చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
సెరి రెండున్నర సంవత్సరాలు
మాజీ సర్పంచ్ మీనాక్షి సంతు నాయక్ బావ్ సింగ్ లక్ష్మణ్ రెడ్డి నాయక్ శంకర్ చందర్ హరిలాల్ పాపారావు మనీ సింగ్ గోర్యా మల్లేష్ కాన్ రామ్, వినోద్ గోబ్రా ఆకాష్ అక్షయ్ రాహుల్ గుండిరావు పూలతోపాటు పలువురు గ్రామ ప్రజల సమక్షంలో పెద్దమనుషుల సమక్షంలో రాథోడ్ విజయ్ కు రెండున్నర సంవత్సరాలు సర్పంచిగా, హీరా సింగ్ చౌవాన్ కు రెండున్నర సంవత్సరాలు సర్పంచిగా, అందరి అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వంతుగా రాథోడ్ విజయ్ కు, రెండవ వంతుగా హీరా సింగ్ చౌవాన్ కు ఇచ్చుకోవాలని అందరు కూర్చొని ఒప్పందాలు చేసుకున్నారు. ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒప్పందల ప్రకారం సామరస్య పూర్వకంగా శాంతియుతంగా సర్పంచ్ పదవులు చేసుకోవాలని గ్రామ పెద్దలు యువకులు ఇద్దరికీ సూచించారు. అయితే దాంతో సిద్ధన్నమదుగు తాండ గ్రామస్తులు శనివారం రోజు పెద్దేముల్ మండలం తట్టేపల్లి క్లస్టర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల కౌంటర్లో ఒకే అభ్యర్థి సర్పంచి వార్డు సభ్యుల గాను నామినేషన్లు వేయడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా పెద్దెముల్ మండల్లోని దుర్గాపూర్ ఆత్కూర్ మన్సాన్పల్లి గ్రామాలలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఆమోదించుకోవడానికి గ్రామస్తులు మొగ్గు చూపుతున్నారు.