ఎన్నికలు
Kura Yadaiah|November 26,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-
Election|రేపటినుండి తెలంగాణలో మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు వికారాబాద్ జిల్లాలో మొదటి విడతగా ఎనిమిది మండలాలకు రేపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది……
Election వికారాబాద్ |:- తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. మంగళవారం నుండి పోడు అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడు విడతలుగా తెలంగాణలో సర్పంచ్ల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. 11 14 17 తేదీలలో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. కోటి 66, లక్షల ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నట్లు తేల్చింది. అయితే మొదటి విడత వికారాబాద్ డివిజన్ తాండూర్ డివిజన్ మండలాల భారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు వికారాబాద్ జిల్లాలో 8 మండలాలకు గాను మొదటి విడత నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తారు.
మొదటి విడత,
*తాండూరు డివిజన్
- తాండూర్
- బషీరాబాద్
యాలాల్
పెద్దేముల్
కొడంగల్
దౌల్తాబాద్
బొమ్మరిస్పేట్
దుద్యాల్
-వికారాబాద్ డివిజన్
*రెండు విడత నామినేషన్ ప్రక్రియ
వికారాబాద్
దారూర్
మోమిన్ పెట్
నవపేట్
బంటరాం
మర్పల్లి
కోటపల్లి
*మూడో విడత
పరిగి
పూడూర్
కుల్కచర్ల
దోమ
చౌడాపూర్
మొత్తం పంచాయతీలు 594 కాగా 5058 వార్డు సభ్యులకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. రేపే మొదటి విడత ఎన్నికలు కావడం వల్ల గ్రామాలలో ఆశావాహులు నామినేషన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.