హోం
Kura Yadaiah|November 19,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :
Police | పెద్దెముల్ ఎస్సై వేణుకుమార్ VR కు బదిలీ చేస్తూ, పెద్దేముల్ నూతన ఎస్సైగా పి శంకర్ ను నియమిస్తూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కే,నారాయణరెడ్డి IPS,ఉత్తర్వులు జారీ చేశారు…..
Police | పెద్దేముల్:– పెద్దేముల్ మండల ఎస్సై వేణు కుమార్ పై వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి IPS, బదిలివేటు వేశారు. ఇటీవల పెద్దెముల్ మండల్ మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని అకారణంగా చితకబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎస్ఐ వేణు కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫిరోజ్ కుటుంబ సభ్యులు సంబంధిత అప్పటి తాండూర్ రూరల్ సీఐ నాగేష్ కు బాధితుడి కుటుంబ సభ్యులు ఎస్సై వేణు కుమార్ అకారణంగా ఫిరోజ్ ను వేధింపులకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే,ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ను అప్పటి తాండూర్ రూరల్ సీఐ నాగేష్ సందర్శించి విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఫిరోజ్ కుటుంబ సభ్యులకు చెప్పిన సంగతి కూడా విధితమే,ఈ నేపథ్యంలోనే పెద్దెముల్ ఎస్సై వేణు కుమార్ పై బదిలీ వేటు పడినట్లు తెలుస్తుంది. అయితే వేణు కుమార్ ను VR కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
-
పెద్దేముల్ నూతన SI గా పి శంకర్,
అయితే ఇది ఇలా ఉండగా వికారాబాద్ సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న పి శంకర్ ను పెద్దెముల్ ఎస్సైగా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.