
టాలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారనే న్యూస్ సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాధిక గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమెకు డెంగ్యూ సోకినట్టు తేలింది. వెంటనే వైద్యుల సూచన మేరకు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకునేంత వరకూ ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి కాస్త ఆందోళన చెందిన టాలీవుడ్ ఆడియన్స్.. రాధిక త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, రాధిక అనారోగ్యం విషయంలో ఇప్పటివరకు ఆమె కుటుంబ సభ్యులవైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.