విద్యార్థుల భవిష్యత్ అంటే తమాషాణ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయండి, లేదంటే ఆందోళనే? జాతీయ బీసీ సంఘం అగ్రనేత కందుకూరి రాజ్ కుమార్

చదువు

Kura Yadaiah October 28,2025,

హిందు 9 న్యూస్ డెస్క్ :

Student scholarships|   ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయండి, విద్యార్థులు అంటే భవిష్యత్తు అంటే అంతా అలుసుగా ఉందా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆందోళన చేస్తామని జాతీయ బీసీ సంఘం అగ్రనేత కార్యవర్గ సభ్యులు తాండూర్ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…

Student scholarships|   ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని విద్యార్థుల భవిష్యత్తును అలుసుగా తీసుకోవద్దని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. వేలకోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు చదువును ముందుకు  కొనసాగించలేకపోతున్నారని ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల యజమాన్యాలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ప్రభుత్వం ఏమాత్రం అయినా ఆలోచన చేయకుండా విద్యార్థుల సంక్షేమం అభివృద్ధి ఆలోచించకుండా లేనిపోని ఖర్చులు చేస్తున్నదని రాజ్ కుమార్ దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలు విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిని ఆందోళనగా ఉందని మండిపడ్డారు. ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అయ్యర్ ఇన్స్టిట్యూట్ యొక్క బకాయిలు చెల్లించకపోతే నవంబర్ మూడవ తేదీన విద్యాసంస్థల చే బందుకు పిలుపునిస్తామని ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని గుర్తు చేశారు. వెంటనే 900 కోట్లకు పైగా బకాయిలు పడ్డ ఫీజులను విడుదల చేసి భావి భారత పౌరుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై ప్రభుత్వం స్పందించకపోతే బీసీ సంఘాలతో కలిసి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రాజకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version