Kura yadaiah |October 27,2025,
హిందు 9న్యూస్ డెస్క్ :
Tribal| మీరు పోరాటం విరమించారు మీ ప్రాణాలను దక్కించుకున్నారు మరి ఆదివాసుల సంగతి ఏంటని ఆదివాసి హక్కుల కార్యకర్త సొను సోరి కడారి సత్యనారాయణరెడ్డి ఖాతా రామచంద్రారెడ్డి సమస్మరణ సభలో మీడియా ముఖంగా ఈ సందర్భంగా అన్నారు.
Tribal| సోను రూపేష్ దాదాలను నేను అడుగుతున్నాను అంటూ పోరాటం విరమించారు మీ ప్రాణాలను దక్కించుకున్నారు కానీ ఆదివాసుల సంగతి ఏంటో చెప్పలేదని సోను రూపేష్ దాదాపు మీడియా ముఖ్యంగా ఆదివాసి హక్కుల కార్యకర్త సొను సోరి కడారి సత్యనారాయణరెడ్డి ఖాతా రామచంద్ర రెడ్డి సమస్మరణ సభ సందర్భంగా మీడియా ముఖంగా ప్రశ్నించారు. సరే మరి ఆదివాసులు ఎక్కడికి వెళ్లాలా లో చెప్పాల్సిన అవసరం ఉందని ఆదివాసి హక్కుల కార్యకర్త సొను సోరి అన్నారు. జల్ జంగల్ జమీన్ ఆదివాసులకు దక్కుతుందా? బస్తర్ లో ఆదివాసుల భూములను ప్రభుత్వం గుంజుకోకుండా ఉంటుందా? అంటూ సోను రూపేష్ దాదాలను ప్రశ్నించారు. ప్రభుత్వం ఆదానీ అంబానీ వంటి కార్పొరేట్లకు మా అడవులను కొండలను గుట్టలను మైనింగ్ కోసం ఇవ్వకుండా ఆపేస్తుందా? దీనికి మీరు సమాధానం చెప్పాలని అన్నారు. బస్తర్లో ఉన్న లక్షలాది మిలటరీని ప్రభుత్వం వెనక తీసుకుంటుందా? కొత్తగా పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేయడం ఆపేస్తుందా? ఇప్పుడు ప్రభుత్వానికి లొంగిపోయిన సోను రూపేష్ దాదాలు ప్రభుత్వంతో మాట్లాడతారా?అంటూ వారిని ఉద్దేశించి ఆమె ఇలా అన్నారు. ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మీరు సరెండర్ మీకోసం అయ్యారా? లేక ఆదివాసుల కోసమా? మీరు ఆదివాసుల కోసం అని చెప్తున్నారు అది నిజమే అయితే నేను అడుగుతున్నది జరుగుతాయా ఒక్కసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ పోరాటం మావోయిస్టుల ప్రభుత్వం మధ్య జరుగుతున్నది కాదు. ఇది ఆదివాసుల యుద్ధం జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసులు చేస్తున్న యుద్ధం ఈ పోరాటాన్ని మీరు ఏ దిశకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటూ ఘాటుగా వండిపడ్డారు సోనుసోరి. మీరు లొంగిపోయిన మేము ఆదివాసులం మా పోరాటం ఆపబోం ఇంతకాలం మేము మావోయిస్టులతో కలిసి పోరాడుతున్నాం .మా వాళ్ల ప్రాణాలు పోయాయి మా పిల్లలు చనిపోయారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పోరాటం చివరి వరకు కొనసాగిస్తాం. మా జన్ జంగల్ జమీన్ మాకు దక్కే వరకు ప్రాణాలు ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని దీన్ని సోను రూపేష్ లు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.