జన సైన్యం మధ్య మావోయిస్టునేత కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియలు

kura Yadaiah| October 18,2025,

హిందు 9న్యూస్ డెస్క్ :

జన సైన్యం మధ్య మావోయిస్టు నేత కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియలు తీగలకుంటపల్లిలో శనివారం రోజు జరిగాయి…..

కరీంనగర్ : సెప్టెంబర్ 22 2025 ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్కౌంటర్లో మృతి చెందిన సంఘటన తెలిసిందే, అయితే కుటుంబ సభ్యులు అక్టోబర్ 18 2025 శనివారం ఉదయం తీగలకుంటపల్లి గ్రామానికి ప్రజా సంఘాలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రజాస్వామిక వాదులు పౌరహక్కుల సంఘం నేతలు ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చారు. అనంతరం కామ్రేడ్ కట్ట రామచంద్రారెడ్డికి పలువురు ఘనంగా నివాళులు అర్పించి తర్వాత మధ్యాహ్నం అంతిమయాత్ర గ్రామం నుండి ప్రారంభమైంది. తన గ్రామంలోని కట్ట రామచంద్ర రెడ్డి అంత్యక్రియలు జన సైన్యం మధ్య వేలాదిగ తరలివచ్చిన పీడిత తాడిత జనాల నినాదాలు మధ్య అంత్యక్రియలు ముగిశాయి.

Exit mobile version