బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ ద్వారానే జరగాలి, Cpi ml new democracy, నాయకురాలు వై గీత

kura Yadaiah| October 18,2025,

హిందు 9న్యూస్ వికారాబాద్ :

వికారాబాద్ పట్టణం బంద్ దృశ్యం

BC reservation |బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ ద్వారా జరిగి 9 షెడ్యూల్లో చేర్చితే తప్ప బీసీలకు న్యాయం జరగదని ఆ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని వికారాబాద్ జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు వై గీత డిమాండ్ చేశారు.

BC reservation |బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకై జేఏసీ బందు పిలుపుతో వికారాబాద్ పట్టణంలో సంపూర్ణ బంద్ జరిగింది. దాంట్లో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బిఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పక్షం బిజెపి తదితర రాజకీయ పక్షాలు బందులో పాల్గొని విజయవంతం చేశాయి. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు వై గీత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషిచేసి బీసీలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర గవర్నర్ కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలను పట్టించుకోవడంలేదని జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు వివిధ రాజకీయ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలు గాని ఇప్పటికీ కొనసాగుతున్నారని మెజార్టీగా ఉన్నటువంటి బీసీలుగా పాలకులుగా మాత్రం వెనుకంజలో ఉన్నారని పేర్కొన్నారు. బి సి రిజర్వేషన్ బిల్లు అమలు రాజ్యాంగ సవరణ ద్వారా జరిగి 9 షెడ్యూల్లో చేర్చి తే బీసీలకు సామాజిక న్యాయం జరగదని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Exit mobile version