కెసిఆర్ కంటి వెలుగు అద్దాలు చెత్తకుప్పలపాలు, ప్రజల సొమ్ము బూడిద పాలు, బాధ్యత లేని అధికారులపై చర్యలు తీసుకోవాలన్న బి ఆర్ ఎస్,

Kcr | కెసిఆర్ కంటి వెలుగు అద్దాలు వికారాబాద్ జిల్లా కొత్తగడి ప్రాంతంలో చెత్తకప్పలపై దర్శనం ఇవ్వడం స్థానికంగా కలకలం రేగింది, ఈ నిర్లక్ష్యానికి ఓడిగట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ డిమాండ్ చేసింది……

Kcr |వికారాబాద్ జిల్లా :గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి కంటి సమస్యలు ఉన్న వ్యక్తులకు అద్దాలు సరఫరా చేసింది. అయితే ప్రభుత్వం కంటి వెలుగు పథకంలో ప్రజల కోసం తీసుకొచ్చిన కంటి అద్దాలను ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కొత్తగడ్డి దగ్గర చెత్తకుప్పలో  దర్శనం ఇవ్వడం  స్థానికంగా కలకలం  రేపింది. ప్రజల సొమ్ముతో టాక్సీల రూపంలో ప్రభుత్వాలకు టాక్సీలు కడుతుంటే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు  ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెడుతుంటే కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యానికి గురై ఇలా చెత్తకుప్పల పైన దర్శనం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి వారికి ఎంత బాధ్యత ఉందో ఈ దృశ్యాన్ని చూస్తే ఇటే అర్థమవుతుంది.

గతంలోనే కంటి వెలుగు అద్దాలను అదే ప్రజలకు ఇచ్చి ఉంటే ప్రజలకు ఉపయోగపడేదేమో  ఇలా చెత్తకుప్పల పాలు చేయడం వల్ల ప్రభుత్వ పథకాలను ఆదాయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఈ దృశ్యాన్ని చూసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.  ప్రభుత్వం ప్రజల బాగుకొరి తీసుకొచ్చిన కంటి వెలుగు అద్దాలను ఇలా చెత్తకుప్పల పాలు చేసిన అధికారులపై ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎవరివైనా ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల ది కాదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అవి ప్రజలకు పూర్తిగా అందే విధంగా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదా అంటూ స్థానికులు నిలదీశారు.

ఇలా వృధా చేయడం ప్రజలకు ఉపయోగపడాట్లు లేదు? ఒకపక్క ఇలా వృధా చేయడం వల్ల  ప్రభుత్వ ఆదాయానికి  నష్టం చేయడమే అవుతుందని అంటూ బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలు ఏ ప్రభుత్వానికైనా చెడ్డ పేరు తీసుకొస్తాయని ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డ అధికారులను కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Exit mobile version