పెద్దెముల్ రైతు సేవా సహకార సంఘం లాభార్జనలోనే ఉంది.యూరియా క్లస్టర్ల వారిగా అందివ్వాలని వ్యవసాయ అధికారులకు సూచిస్తాం, వెల్లడించిన చైర్మన్ డి, విష్ణువర్ధన్ రెడ్డి

వ్యవసాయం, సహకార సంఘం ,

Kura Yadaiah /September 30,2025,

Farmar society|  సంఘంలో రుణాలు  తీసుకున్న రైతులు  సకాలంలో చెల్లించాలని ఇప్పటికే సంఘం లాభార్జనలోనే ఉందని అలాగే అసైన్డ్ భూముల రుణాల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పెద్దెముల్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు……

Farmar society| పెద్దేముల్: సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించాలని సంఘం ఇప్పటికీ లాభార్జనలోనే ఉందని అయితే అసైన్డ్ భూముల రైతుల రుణాలు మాఫీ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రుణాలు కట్టుకోలేని దీర్ఘకాలిక సభ్యులకు 25% రాయితీ కూడా ఇవ్వాలని సంఘం నిర్ణయించిందని పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ డి, విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.మంగళవారం  పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం  చైర్మన్ డి, విష్ణువర్ధన్ రెడ్డి  అధ్యక్షతన  జరిగిన 49, సాధారణ సభ్యత్వ సమావేశంలో ఈ సందర్భంగా అన్నారు.

జమ ఖర్చుల పట్టిక ను ఆమోదం, ఆస్తి అప్పుల పట్టికను పరిశీలన 2025 -26 సంవత్సరపు అంచనా బడ్జెట్ అలాగే 2024 సంవత్సరపు లెక్కల ఆడిట్ రిపోర్టు 2024 25 సంవత్సరపు సంఘం యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్స్ చేయుట పాలకవర్గం 6 నెలలు పొడిగింపు పై సమావేశంలో చర్చ జరుపుతూ సభ్యుల ఆమోదిం పొందారు. అయితే యూరియా ఇబ్బందులు రైతులకు చాలా తలనొప్పిగా మారాయని ఇకనుండి క్లస్టర్ల వారిగా రైతు వేదికల వద్ద యూరియా రైతులకు అందే విధంగా చూడాలని సభ్యులు కోనేరు అనంతయ్య బల్ల పెంటప్ప తదితరులు సమావేశంలో చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది.  ఈ విషయంపై స్పందించిన చైర్మన్ క్లస్టర్ల వారీగా రైతు వేదికల వద్ద ఇకనుండి రైతులకు యూరియా అందే విధంగా అగ్రికల్చర్ శాఖకు ఒక తీర్మానం పంపుతామని రైతులకు రైతు వేదికల వద్దనే యూరియా అందేటట్లు చూస్తామని చైర్మన్ అన్నారు. అలాగే అసైన్డ్ భూముల రైతులకు రుణాలు మాపి కాలేదని ఇటు మాపి కాక అటు రెన్యూవల్ కాక ఇటు కొత్త రుణాలు ఇవ్వక రైతులు చాలా ఆందోళనగా ఉన్నారని పలువురు రైతులు సమావేశంలో చర్చ లేవనెత్తగా ఇట్టి సమస్యను కూడా సభ్యులతో ఒక తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. రుణ దీర్ఘకాలికంగా రుణాలు చెల్లించని రైతులకు 25% రైతులు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే FB రుణాలు తీసుకునే వారికి కూడా 50% రాయి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక రైతుకు రెండు సంచులు చొప్పున ఆధార్ కార్డు పాస్ బుక్కు తీసుకువస్తే ఒక రైతుకు రెండు సంచుల చొప్పున యూరియా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రాప క్రాప్ లోన్స్ రెన్యువల్ కూడా సకాలంలో  చేసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రతి సహకార సంఘంలో కంప్యూటర్ ఈ కరణ ఉందని రెండు మూడు నెలల్లో సంఘంలో కంప్యూటర్ ఈ కరణ చేస్తూ ఆన్లైన్ చేయడం జరుగుతుందని ఇకనుండి ప్రతి రికార్డు కూడా ఆన్లైన్ చేస్తామని తెలిపారు. సహకార సంఘం లిమిటెడ్ జమ ఖర్చులు తదితర అంశాలు ఆశాజనకంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇకనుండి యూరియా సంబంధించిన రైతులు పాస్బుక్ ఆధార్ కార్డు తో పాటు వచ్చి యూరియా తీసుకోవచ్చునని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికే లక్ష నుండి రెండు లక్షల వరకు ఉన్న రుణాల రైతులు 377 మందికి వచ్చిందని ఇంకా 139 మంది రైతులకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ రావలసి ఉన్నదని చైర్మన్ తెలిపారు. సంఘంలో ఇప్పటివరకు 144 మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు.

సకాలంలో రైతులు తమ అప్పులను చెల్లించాలి, శ్రీనివాస్ సంగారెడ్డి మేనేజర్,

సకాలంలో రైతులు తమ తమ అప్పులను తిరిగి చెల్లిస్తే సంఘం కొత్తవారికి ఇచ్చేందుకు సౌకర్యంగా ఉంటుందని ఎస్బిఐ ఎసిబి మేనేజర్ శ్రీనివాస్ సంగారెడ్డి అన్నారు. ఇది రైతుల వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించే సంఘము కాబట్టి రైతులందరూ కూడా తమ తమ బాకీలను సకాలంలో  కట్టుకొని సంఘాన్ని అభివృద్ధి దిశగా నడుపుకోవాలని  శ్రీనివాస్ సంగారెడ్డి సూచించారు. అభివృద్ధి దిశలో సంఘం నడవాలంటే పూర్తిగా సభ్యుల రైతుల సహకారం చాలా అవసరమని రైతు సేవా సహకారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యుల రైతులందరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో మురళీధర్,  డైరెక్టర్ రవిశంకర్ సిహెచ్ దస్తప్ప పి గోపాల్, సిబ్బంది పెంటయ్య ఫయాజ్ ప్రవీణ్ కుమార్ నర్సింలు మానెప్ప రైతులు ప్రకాశం బసప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version