అంబులెన్స్ లోనే గర్భిణి ప్రసవం, డాక్టర్ వినయ్ సూచనలతో డెలివరీని విజయవంతం చేసిన ఈఎంటి మోహన్, అభినందించిన కుటుంబ సభ్యులు,

సేవా 

Kura Yadaiah/September 27,2025,

 Tandur mch|  కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సంగీత అనే గర్భిణి స్త్రీని తాండూర్ ఎం సి హెచ్ కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమవడంతో డాక్టర్ వినయ్ సూచనల మేరకు ఈఎంటి మోహన్ డెలివరీని విజయవంతం చేశారు.

హిందు 9 న్యూస్( తాండూర్ ) ;వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సంగీత కు పుట్టినోప్పులు రావడంతో 108 అంబులెన్స్ ను సంప్రదించగా అంబులెన్స్ సదరు గర్భిణీ మహిళా సంగీతను తాండూర్ మాత శిశు కేంద్రానికి( mch ) కు తరలిస్తుండగా పెద్దేముల్ మండలం జనగాం గ్రామ సమీపంలోకి రాగానే సంగీతకు పురిటి నొప్పులు అధికమవడంతో. ఈఎంటి మోహన్ డాక్టర్ వినయ్ సూచనలను అనుసరిస్తూ సదరు మహిళా డెలివరీని విజయవంతం చేశారు.

-తల్లి బిడ్డ క్షేమం,

సంగీత కు పండంటి బాబుకు జన్మనిచ్చిందని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం   ఎం సి హెచ్ తాండూరుకు తరలించినట్లు మోహన్ తెలిపారు.

సంబరాల్లో మునిగి తేలిన కుటుంబ సభ్యులు 108 సిబ్బంది మోహన్ మరియు శ్రీకాంతులను కుటుంబ సభ్యులు అభినందించారు.

Exit mobile version