గోపాల్ రావు పల్లి లో కడారి కి కన్నీటితో వీడ్కోలు పలికిన అశేష జనం, ముగిసిన కోసా దాదా,అంత్యక్రియలు,

నివాళులు ,

Kura yadaiah /September 26,2025,

 

ఇటీవల అబూజ్ మడ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియలు గురువారం రోజు తన స్వగ్రామంలో అశేష జనవాయుని మద్య ముగిశాయి………

హిందు 9న్యూస్/ సిరిసిల్ల:  ఇటీవల అబూజ్ మడ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస్తా అంత్యక్రియలు తన స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా గోపాలరావుపేటలో గురువారం రోజున ముగిశాయి. ప్రజలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు వివిధ కమ్యూనిస్టు పార్టీలన్నీతలు పెద్ద ఎత్తున పాల్గొని కడారి సత్యనారాయణరెడ్డికి అంతిమ వీడుకోలు పలికారు. విప్లవ గీతాలతో ఎర్ర జెండాలు పట్టుకుని కడారి సత్యనారాయణ పోరాటాన్ని ఉద్యమాన్ని నెమరు వేసుకుంటూ జోరు నినాదాలతో సోక సముద్రంలో మునిగిపోయారు.

కురిసిన వర్షములో కడసారి వీడ్కోలు ….

గురువారం రోజు కురిసిన వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బంధుమిత్రులు ప్రజాసంఘాల నేతలు కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఎర్రజెండాలు పట్టుకొని వారి ఉద్యమాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు కదిలారు. అయితే మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండల అధ్యక్షుడు రాజన్న కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ సామాజిక ఉద్యమ నేత కమ్యూనిస్టు భావజాల నేత గాదే ఇన్నయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజర్ల అశోక్ బంధుమిత్రుల సంఘం పద్మ విరసం నేత పాణి తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. మధ్యమధ్యన విప్లవ గీతాలతో కడారి సత్యనారాయణ రెడ్డికి నివాళులు అర్పిస్తూ పాటలు పాడుతూ చివరగా ఆయన సొంత అన్న కడారి కరుణాకర్ రెడ్డి ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులతో కలిసి కడారి సత్యనారాయణ రెడ్డి భౌతికగాయానికి నిప్పంటించి తుది వీడుకోలు పలికి గొల్లుమని ఏడ్చారు.

45 ఏండ్ల విప్లవ జీవితం...

సమ సమాజ స్థాపన కోసం సాయుధ పంథనె అంతిమ మార్గమని నమ్మి ప్రజల కోసం భారత దేశంలో నూతన విప్లవం కోసం సమ సమాజ స్థాపన కోసం కలలుగన్న 45 ఏళ్ల పాటు అడవుల్లోనే ఉంటూ చివరకు నాలుగు రోజుల కిందట జరిగిన భారత భద్రత దళాల కాల్పుల్లో ఎన్కౌంటర్కు గురై కడారి సత్యనారాయణరెడ్డి చివరి జీవితం ముగిసింది. దశాబ్దాలుగా తన కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఎన్నో ఏళ్ల తర్వాత చివరిగా మూగబోయిన తన గొంతును తుది శ్వాస విడిచిన తన భౌతిక గాయాన్ని తన గ్రామానికి తీసుకురావడంతో ఆయన భౌతిక గాయాన్ని చూడడం వల్ల అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.

బూటకపు ఎన్కౌంటర్….

మానవ హక్కుల సంఘాలు పౌర హక్కుల సంఘాల నేతలు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని వాదించారు. పౌర హక్కుల సంఘం కార్యదర్శి నారాయణరావు భారత్ బచావో జాతీయ కమిటీ చైర్మన్ గాదే ఇన్నయ్య రెడ్డి విప్లవ రచయితల సంఘం కార్యదర్శి పాణి సాంబమూర్తి బంధుమిత్రుల కమిటీ నాయకురాలు పద్మ కడారి సత్యనారాయణ రెడ్డి కి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. గాదె ఇన్నయ్య పౌర హక్కుల సంఘం కార్యదర్శి నారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ముమ్మాటికి కేంద్రం ప్రభుత్వం చేసిన బూటకపు ఎన్కౌంటర్ అని ఈ ఎన్కౌంటర్లో సత్యనారాయణ రెడ్డిని అనేక చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వాలు శాంతి చర్చల ద్వారానే ప్రపంచ దేశాలలో అనేక సమస్యలను పరిష్కరించుకున్న చరిత్రలు ఉన్నాయని ఆ దిశగా మావోయిస్టు పార్టీ దేశ పీడిత ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సీనియర్ అధికారులు మేధావులు చేసిన సూచనలకు తలవగి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మొండిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారితో శాంతి చర్చలు జరపకుండా ఆపరేషన్ కగారు పేరుతో వారిని మట్టు పెడుతూ వస్తున్నారని ఇది భారత పీడిత ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.


కడారి సత్యనారాయణరెడ్డి అంచలంచలుగా ప్రజా పోరాటాలలో నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ కేంద్ర మావోయిస్టు పార్టీ స్థాయికి ఎదిగారని ద్రోహుల సమాచారంతో కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డి తో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదాను చతిస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో అబూజ్ మడ్ అడవుల సరిహద్దులో ఎన్కౌంటర్లో కాల్చి చంపారని నేతలు ఆరోపణలు చేశారు. విప్లవ అభిమానులు కడసారిగా కడారి సత్యనారాయణ రెడ్డికి కన్నీళ్ళతో జోహార్లు అర్పిస్తూ గ్రామస్తులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని అక్కడికి వెళ్లిన అనేక ప్రజానీకంతో తన జ్ఞాపకాలను సంబంధాలను గుర్తుచేసుకొని అక్కడి ప్రజలు కన్నీటి వేడుకోలు పలికారు.

Exit mobile version