ముఖ్యాంశాలు
Kura Yadaiah |February 9,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

-తాండూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజల మీద పూర్తి నమ్మకం,
-తాండూర్ ను మోడల్ మున్సిపాలిటీగా చేస్తాం,
– అధిష్టానం నిర్ణయం మేరకే చైర్మన్ ఎన్నిక, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
తాండూర్ ను మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని ఇప్పటికీ అనేక రకాలుగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని త్వరలో తాండూర్ ప్రజలకు కాలుష్యం నుండి విముక్తి కల్పిస్తామని, అలాగే కాగ్న నది నుండి ఇక్కడి ప్రజలకు దాహార్తిని తీర్చే కార్యక్రమం త్వరలో చేపడతాం తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని నాకు ప్రజల మీద పూర్తి నమ్మకం ఉందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు…
హిందు 9 న్యూస్( తాండూర్ )తాండూర్ మోడల్ మున్సిపాలిటీగా చేస్తాం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం పాటించి సీట్లు ఇచ్చాం అందరూ సంతోషంగానే ఉన్నారు గత రెండేళ్ల పాలనలో తాండూర్ లో పట్టణంలో అభివృద్ధి జరిగిందని ప్రజలు మాతో ప్రచారంలో మాతో అన్నారని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజు తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ మురళి గౌడ్ రవి గౌడ్ రవూఫ్ లతో కలిసి ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వంలో చిలుక వాగు టెండర్లు పిలిచి పనులు కూడా జరుగుతున్నాయని గొల్లచెరువు లో వర్షాకాలంలో అక్కడి ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఇండ్లలోకి నీళ్లను రాకుండా పనులు చేపట్టి వర్షపు నీటిని వేరే మార్గాల బయటికి పంపించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాత తాండూర్ బ్రిడ్జి వరకు విషయంలో చాలా ఇండ్లు కోల్పోవడం రావడంతో అక్కడి ప్రజలు ఇట్టి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే అధికారులతో చర్చించి బ్రిడ్జి 4 నుండి 20 ఫీట్లకు తగ్గించి 90 కోట్ల నిధులతో బ్రిడ్జి పనులు మొదలు పెట్టామని తెలిపారు. తాండూర్ నుండి వికారాబాద్ వెళ్లే మెయిన్ రోడ్డు గతంలో ప్రయాణికులకు అనేక ఇబ్బందులు తలెత్తిన పరిస్థితిని మనమంతా చూసినం ఆ రోడ్డుపనుల విషయంలో అసెంబ్లీలో చర్చ పెట్టి 50 కోట్లతో పనులు ప్రారంభించామని అన్నారు.

తాండూర్ పుస్తకంలో 19 కోట్లతో సీసీ రోడ్ల పనులు చేశామని స్పష్టం చేశారు. మంచినీళ్ళకై డిపిఆర్ ద్వారా ప్రణాళిక రచించి 27 కోట్ల రూపాయలతో మంచినీటి పథకంకై పనులు ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సక్రమంగా నీరు అందడం లేదని మిషన్ భగీరథ పథకం ద్వారా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. తాండూర్ పట్టణ సమీపంలో కాగ్న నది నీళ్లు తాండూర్ పట్టణానికి అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. తాండూర్లో భూ కబ్జాలకు తావు లేకుండా ఎలాంటి అక్రమాలు భూకబ్జాలు జరగకుండా చూసామని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలకు స్వేచ్ఛాయుతంగా వ్యాపారులు వ్యాపారం నిర్వహించుకునేలా వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నదని అన్నారు. గతంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటేనే అనేక గొడవలు సమస్యలు తలెత్తేనని సరిగ్గా సమావేశం జరిగేదే కాదని ఎమ్మెల్యే ప్రతిపక్షం పై ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏమీ లేదని ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 18 నుండి 20 పార్కులు తాండూర్ లో ఉంటే ఇప్పటికీ ఆ పార్కుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నామని స్పష్టం చేశారు. పాలిష్ యూనిట్ సంబంధించిన వ్యాపారులకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని వారికి కూడా త్వరలోనే పాలిష్ యూనిట్లకు ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి వారి అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు. తాండూర్ కు బైపాస్ రోడ్డు చాలా అవసరం ఉంది బైపాస్ రోడ్డు లేకపోవడం వల్ల తాండూరులో కాలుష్యం పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థులు ప్రజలు అవస్థలు పడుతున్నారని మొత్తం కాలుష్య నివారణ కోసం బైపాస్ రోడ్డు పనులను వేకవంతం చేయాల్సిన అవసరం ఉందని గతంలో బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో అధికారులను కలెక్టర్ తో చర్చించి ముఖ్యమంత్రి సహకారంతోని 25 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని అది కోడ్ ముగిసిన తర్వాత బాధితులకు అందజేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
శాఖాహారం మాంసాహారం మార్కెట్ల కోసం అక్కడున్న వ్యాపారుల సలహాలు సూచనలు తీసుకొని వారికి కూడా ఒక ప్రత్యేకమైన మార్కెట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అటు వ్యాపారులకు ఇటు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వారి సూచన మేరకు శాకార మాంసాహార మార్కెట్లను ఏర్పాటు చేసేటట్లు చూస్తామని స్పష్టం చేశారు. తప్పకుండా తాండూర్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ఎంతో కృత నిక్షయంతో ఉన్నారని తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని తమకు భరోసా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం సూచన మేరకు చైర్మన్ ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం బీసీలలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి దక్కుతుందని ప్రకటించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య ఒడె శీను కలాల్ నర్సింలు గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
